వేమన భగవాన్

వేమన భగవాన్
  • للاندرويد 4.1 للاندرويد
  • الاصدار: 1.0.1
  • 18 MB
تحميل

قم بالتحديث لأحدث نسخة 1.0.1!


app اسم వేమన భగవాన్
الاصدار 1.0.1
المطور Three Souls
يتطلب نسخة اندرويد للاندرويد 4.1
أخر تحديث 2024-01-24

تحميل వేమన భగవాన్ app للاندرويد

రెడ్డి కులమున పుట్టి వేమనయోగి నామధేయము పొందిన వేమారెడ్డి గారు జీవితములో ఎన్నియో మలుపులు చూచాడు. కష్టసుఖాల అంచులు చూచి జీవితము మీద విరక్తి కల్గి, వదినె సహకారముతో, శివయోగి ఉపదేశముతో, ప్రేరేపితుడై సత్యము తెలుసుకొని తను తెలుసుకున్న జ్ఞానమును పద్యరూపములుగ బోధించినాడు. ఆయన పద్యములన్నియు సులభశైలిలో ఉండును. ప్రతి పద్యము బాహ్యర్థముగ చెప్పినట్లు కనిపించుచుండును. అందువలన వేమన తన పద్యములలో లోకనీతి ఎక్కువగా చెప్పినాడని చాలామంది అనుచుందురు. వాస్తవముగ తన పద్యములలో జ్ఞానము తప్ప నీతి, న్యాయము గురించి ఏమాత్రము లేవు. వేమనయే స్వయముగ నేను చెప్పినదంతయు జ్ఞానమే అన్నాడు. జ్ఞానము అర్థం చేసుకోలేని వారు వేయి విధములు అర్థముతో ఆయన పద్యములను పోల్చుకొనుచుందురు.

భూమిమీద జన్మించిన యోగులలో ఉత్తమమైన యోగి వేమన యోగి. అందరి స్వాములవలె ఈయన ప్రచారము కాకున్నను అందరికంటే మేటి యోగియని చూడకనే చెప్పవచ్చును. తక్కువ రచనలో ఎక్కువభాగము ఇమిడ్చినవారు తక్కువ భావమును పెద్ద రచనలలో కూర్చిన వారికంటే ప్రశంసనీయులు. చాలా పెద్ద భావములను చిన్న పద్యములలో ఇమిడ్చినవారు ఒక్క వేమనేనని గట్టిగ చెప్పవచ్చును. తన జీవితములో తెలుసుకొన్న దైవత్వమును జ్ఞానరూపమున పద్యములలో దాచి ఉంచిన వారు వేమన. ఆయన పద్యములను ఊరక చదివినంతమాత్రమున అందులోని రహస్యము బయటపడదు. యోచించి చూచినపుడే ఆయన పద్యమర్థమగును.

తనపద్యములను అర్థము చేసుకొను శక్తి అందరికి ఉండదని తెలిసిన వేమారెడ్డి తన అంత్యకాలంలో తన కులములో కొందరి యువకులను పిలిచి తన పద్య రహస్యములన్నియు తెలిపి నా జీవితము అంతయు గడచిపోయినది నేను చెప్పిన జ్ఞానమంతయు నాపేరు మీద మీరు ఊరూరు తిరిగి ప్రచారము చేసి అజ్ఞానులను జ్ఞానులుగ మార్చమని తెలిపినాడు. ప్రయాణము చేయుటకు ఆ కాలములో ఇప్పటిలా వాహనములు లేవు. కావున ప్రయాణమునకు అనుకూలముగ మంచి గుఱ్ఱమును పెట్టుకొని గ్రామములకు పోయి అక్కడగల సత్రములో దిగి ఊరి ప్రజలందరికి వేమారెడ్డి వచ్చాడని దండోరా వేయించి సాయంకాలము తనవద్దకు అందరు వచ్చునట్లు చేసి తన పద్యముల జ్ఞానమును బోధించమని వేమన చెప్పిపోయినాడు. పెండ్లియైన వారికి అనుకూలముగ ఉండదని పెండ్లికాని వారికి మాత్రమే ప్రచార కార్యమును తెలిపి పోయినాడు.

కాని స్వకులస్తులైన రెడ్డి కులమువారు ఇంతమంది ఉండి మరియు ఎంతో ధనికులుగ పేరు ప్రఖ్యాతులు గాలవారిగ ఉండి వేమనకు ఏమి చేసినట్లు? అసలు వేమనయోగి అంటే ఎవరో తెలియనివారు కూడ రెడ్డి కులములో కలరు. వేమన సమాధి ఎక్కడుందో తెలియనివారున్నారు. వేమనయోగి ఆశయములను నెరవేర్చని వారము ఆయనకు మనమేమి చేసినట్లు? నిజమునకు ఆయనే మనకు ఎక్కువ చేశాడు. పరిపూర్ణమైన వేమనద్వారా రెడ్డి కులస్తులకు అందరికి ఆయన కీర్తి లభించినది.

కలియుగముననున్న కాపుకులాలకు
వేమన ధనకీర్తి విక్రయించె
నున్న ధర్మమెల్ల నుర్విలో నరులకు
కోరుపెట్టె పరమ గోరి వేమా.


వేమన ఒక ఆధ్యాత్మికవేత్తయేకాక నేటి హేతువాదులకు అందరికి గురువులాంటివాడు. ఆయన తన పద్యములలో ఎన్నో మూఢ విశ్వాసములను నిష్పక్షపాతముగ ఖండించాడు. అంతేకాక మూఢాచారములను, అక్రమ జ్యోతిష్యమును హేతుపద్ధతిలో ఖండించి పెద్దలమనుకొని చేయువారి చేష్టలను పూర్తిగా విమర్శించాడు. అందువలన నేటి కాలములో చాంధసవాదులైన కొందరికి వేమన వాదన సరిపడదు. వారంతా వేమనను తిక్కవాని క్రిందికి జమకట్టడము వలన వేమన యొక్క ఔన్నత్యము ప్రజలందరికి తెలియక పోయినది. నేటికి కూడ ఒక కులమువారు వేమనను హేళనగ మాట్లాడడము ఆయన మాటలను మతిలేని మాటలనడము మేము చూస్తూనే ఉన్నాము. ఆలా కొందరు ఆయనను అన్నివిధముల తక్కువ చేయగ స్వయాన రెడ్డి కులస్థులు కూడ ఆయనను గమనించక పోవడము, ఆయన గొప్పతనమును గుర్తించలేకపోవడము వలన వేమన కొంత మరుగునపడిపోయాడని చెప్పవచ్చును. ముఖ్యముగ చెప్పాలంటే వేమన జీవిత ధ్యేయమైన జ్ఞానప్రచారము రెడ్డి కులస్థుల మీదనే వేమన పెట్టిపోయాడు. ఆయన ధ్యేయమును సరిగ నిర్వర్తించలేకపోవడము ఒక లోపమనియె చెప్పవచ్చును. నేడు సమాజములో ఎన్నో విషయములలో ఎంతో గొప్ప స్థానముల వరకు ఎదిగిపోయిన రెడ్లు ఆధ్యాత్మిక విషయము యొక్క రుచినే తెలియక పోయారు. ఇప్పటికైనా మించిపోయినది లేదు. రెడ్డి కులస్తులు వేమన ప్రచార సంఘమును స్థాపించి ఆయన గొప్పతనమును చాటిచెప్పితే వేమన కీర్తి భారతదేశములోనే కాక విదేశములకు కూడ విస్తరించగలదు. క్రీ.శ. 1839వ సంవత్సరములో ఇంగ్లాండ్ దేశస్తుడైన రాబర్ట్ బ్రౌన్ వేమన పద్యములలోని ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఆయన పద్యములను ఇంగ్లీష్ లోనే కాక మరెన్నో విదేశీ భాషలలో ముద్రించి ప్రచారము చేయగ ఆయన వారసులైన మనము వేమనంటే ఎవరో తెలియని స్థితిలో ఉండడము చాలా సిగ్గుచేటు.


ఇట్లు
త్రిమత ఏకైక గురువు
ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి
శతాధిక గ్రంథకర్త
ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత
సంచలనాత్మక రచయిత
త్రైత సిద్ధాంత ఆదికర్త
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు
  • 4.8
4.8 (138)
معلومات إضافية من جوجل بلاي:
  • أخر تحديث
  • السعر$0
  • عدد التحميلات 1,000+
  • الفئة العمرية 12+ سنة
سرعة عالية و بدون فيروسات!

تم اختبار الروابط من قبلنا وهى سريعه وأمنه للتحميل!